calender_icon.png 31 January, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ కేంద్రం వద్ద సందడే సందడి

31-01-2026 02:18:38 AM

చివరి రోజు వెల్లువెత్తిన నామినేషన్లు

నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

ఆదిలాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల కోసం నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం నామినేషన్ల చివరి రోజు కావడంతో టీటీడీసీ కేంద్రం వద్ద సందడి నెలకొంది. పోటీ చేసే అభ్యర్థులు తమ అనుచరులతో పెద్ద ఎత్తున కేంద్రానికి రావడంతో పొలాహారం నెలకొంది. మొత్తం 49 వార్డులగాను వందల్లో నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ చివరి రోజు సాయంత్రం ఐదు గంటల వరకు పెద్ద ఎత్తున అభ్యర్థులు రావడంతో రాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. నామినేషన్ సమయం ముగుస్తుందని పలువురు అభ్యర్థులు పరుగులు తీస్తూ కేంద్రానికి చేరుకున్నారు.

తొలి రోజు 8 నామినేషన్లు రెండవ రెండు 141 నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజు మాత్రం సుమారు 300 వరకు నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ రాజర్షిషా పరిశీలించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు డి. హనుమంత్ నాయక్, కలిసి కేంద్రానికి వచ్చిన కలెక్టర్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు ఉన్నారు.