31-01-2026 02:18:55 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున లోహ విహంగాలు సందడి చేశాయి. బేగంపేట విమానాశ్రయం వేదికగా జరుగుతున్న ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన వింగ్స్ ఇండి యా-2026 మూడో రోజు అట్టహాసంగా సాగింది.శుక్రవారం సందర్శకులకు ప్రవేశం కల్పించడంతో నగర ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో విమానాశ్రయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఆకాశమే హద్దుగా సాగిన వైమానిక విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి.
కాగా భారత వాయుసేనకు చెందిన ప్రతిష్టాత్మక సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం చేసిన సాహసో పేత విన్యాసాలు ఈ ప్రదర్శనకే హైలైట్‌గా నిలిచాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయు డు ట్విట్టర్ వేదికగా వింగ్స్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనడం తనకు గొప్ప అనుభూ తినిచ్చిందన్నారు.
120కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనడం భారత విమానయాన రంగంపై ప్రపంచానికి ఉన్న విశ్వాసాన్ని చాటుతోందని మంత్రి కొనియాడారు. భారత్ త్వరలోనే ప్రపంచ విమా నయాన కేంద్రంగా అవతరించడం ఖాయమనిపిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశముంది.