calender_icon.png 7 December, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

06-12-2025 12:00:00 AM

మఠంపల్లి , డిసెంబర్ 5  : మండలంలోని మఠంపల్లి  క్లస్టర్‌లో మఠంపల్లి, గుండ్లపల్లి, రఘునాథపాలెం, చౌట పల్లి, బక్కమంతులగూడెం గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డ్ సభ్యుల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శుక్రవరం పరీశిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోకెన్ జారీ చేసిన నామినేషన్ పత్రాలు స్వీకరించటం జరుగుతుందని, అభ్యర్థులు ఆందోళన పడకుండా ఎన్నికల సిబ్బందికి సహకరించాలన్నారు.

నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు సాయంత్రం 5 గంటలు దాటినా తర్వాత  నామినేషన్ కేంద్రం ఆవరణలో ఉన్న ప్రతి ఒక్క్కరికి టోకెన్స్ జారీ చేయటం జరిగిందని అభ్యర్థులు అందరు సిబ్బంది కి సహకరిస్తే మరో కౌంటర్ ఏర్పాటు చేసి వేగవంతంగా వరుస క్రమంలో నామినేషన్ పత్రాలు తీసుకుంటామని  తెలిపారు. అప్పటివరకు అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా కూర్చునేందుకు కుర్చీలు, త్రాగునీరు లాంటి మౌళిక వసతులు ఏర్పాటు చేపించారు.కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ మంగ, ఎంపిడిఓ జగదీశ్, అధికారులు ఉన్నారు.