calender_icon.png 7 November, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుడిగాలి విధ్వంసాన్ని పరిశీలించిన కలెక్టర్

07-11-2025 12:54:15 AM

దండకారణ్యంలో మోటార్ బైక్ పై ప్రయాణం

కాటారం, నవంబర్ 6 (విజయక్రాంతి) :  సుడిగాలికి ధ్వంసం అయిన పంటలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. పలిమెల మండలం లెంకల గడ్డ శివారు అటవి ప్రాంత పంట పొలాలలో మంగళవారం బారి సుడిగాలి ప్రభావానికి పంటలు, అడవిలో చెట్లు కూలిపోగా  సుమారు 30 నుండి 40 ఎకరాలలో పత్తి, మిర్చి, వరి పంటలు ధ్వంసం అయ్యాయని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులు ప్రాథమికంగా పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అందించాలి అని అధికారులను ఆదేశించారు.

అధికారులు అందించిన నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని  పేర్కొన్నారు. అనంతరం వాహనం వెళ్ళడానికి అవకాశం లేకపోగా మోటార్ సైకిల్ పై  అటవీ శాఖ అధికారులతో  కలిసి వెళ్లి  నేలకొరిగిన వృక్షాలను పరిశీలించా రు. అటవి ప్రాంతంలో విరిగిన చెట్లను లెక్కించి నివేదిక అందించాలని సూచించారు. చెట్లు నేలకొరిగిన చోట నూతన  ప్లాంటేషన్ చేపట్టి అడవుల పునరుద్ధరణ కు చర్యలు తీసుకోవాలని  తె లిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సునీల్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, తహసీల్దార్ సునీల్, ఎంపిడిఓ  సాయి పవన్ ఇతర శాఖల అధికారులు సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.