calender_icon.png 7 November, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి పోటీల్లో పాపన్నపేటకు ప్రోత్సాహక బహుమతి

07-11-2025 12:56:09 AM

విజయక్రాంతి, పాపన్నపేట హైదరాబాదులో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థా యి కళా ఉత్సవ్ జానపద నృత్య పోటీల్లో పాపన్నపేట ఉన్నత పాఠశాల విద్యార్థుల కు ప్రోత్సాహక బహుమతి దక్కింది. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లా జట్లు పాల్గొన్నాయి.

బహుమతి పొందిన పాపన్నపేట జట్టుకు హైదరాబాద్ లో గురువారం సా యంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో ఏఎస్పీడి రాజీవ్ ప్రశంస పత్రాలు, మెడల్స్ అందించారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలకు రాష్ట్రస్థాయిలో ప్రోత్సాహక బహుమతి అందడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు.