calender_icon.png 1 October, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చండీయాగ హోమంలో పాల్గొన్న కలెక్టర్, పోలీస్ కమిషనర్

01-10-2025 12:48:51 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో  దసరా నవరాత్రి ఉత్సవాల లో భాగంగా చండీయాగం నిర్వహించారు.  దుర్గా పరమేశ్వరి మాత మందిరంలో నవరాత్రి ఉత్సవాలలో భాగముగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం ముందు మంగళవారం ‘మహా చండీయాగం‘ కార్యక్రమం నిర్వహించరు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, పాల్గొనడం జరిగింది.

అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ ( అడ్మిన్ ) జి. బస్వా రెడ్డి, అదనపు డీసీపీ ( ఏఆర్ ) రామచంద్రరావు , అదనపు కలెక్టర్ ( లోకల్ బాడీస్ ) అంకిత్, అదనపు కలెక్టర్ (  రెవెన్యూ ) కిరణ్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వీయ, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహన్తో, డిఎం అండ్ హెచ్ ఓ రాజశ్రీ, ట్రేని కలెక్టర్ నిజామాబాద్,  ఆర్మూర్,  బోధన్, ట్రాఫిక్ ఏసిపిలు, సీఐలు ఎస్త్స్రలు పాల్గొన్నారు.