09-01-2026 12:10:30 AM
కాగజ్‌నగర్, జనవరి 8 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను గురువారం హైదరాబాద్ లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ జాన్సన్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరం సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ తదితరులు పాల్గొన్నారు.