18-07-2025 11:49:39 PM
జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కలిగి ఉండాలని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత జిల్లా స్థాయి అధికారులతో ఆధార్ మానిటరింగ్ కమిటీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పిల్లలు జన్మించిన వెంటనే సంబంధిత అసుపత్రి వారి ద్వారా జనన దృవీకరణ పత్రం తీసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో పిల్లలకు టీకాలు వేసే సందర్భంలో ఆధార్ ద్వారా ఎన్రోల్మెంట్ ను ప్రోత్సహించాలని తెలిపారు.అంగన్ వాడీ కేంద్రాలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆధార్ లేనట్లయితే నమోదు చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మీ-సేవ కేంద్రాలలో జనన దృవీకరణ పత్రం ఇచ్చే సమయంలోనే ఆధార్ కార్డు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.