11-09-2025 12:36:41 AM
యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 10 ( విజయకాంత్ ): యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి సాయి హోటల్ యాజమాన్యం బాలల హక్కులకు భంగం కలిగిస్తుంది. బడికి వెళ్లి చిట్టి చేతులతో అక్షరాలు దిద్దాల్సిన ఆరు సంవత్సరాల వయసు గల బాలిక చిట్టి చేతులతో హోటల్ లో చాకిరి చేయించుకుంటుంది. బాలిక, కుటుంబ ఆర్థిక పరిస్థితిని అవకాశంగా తీసుకున్న యాజమాన్యం బాలికను హోటల్ లో పనికి కుదుర్చుకొని, పాప చేత కస్టమర్లు తిన్న ప్లేట్లు, గ్లాసులు, మద్యం సీసాలను తీయిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఆ పాప బంగారు జీవితం తాగుబోతుల అడ్డాకు దాసోహం అయింది. ప్రతి ఏటా బాలల హక్కుల చట్టాలను రక్షించాలంటే ర్యాలీలు ఉపన్యాసాలు ఇచ్చే అధికారులు కు ఇ దృశ్యాలు కనబడవా పట్టించుకోరా..
చట్టాలకు తూట్లు పొడిచి మానవత్వం లేకుం డా చిన్న పాప చేత హోటల్ పనులు చేయించుకుంటున్న యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకుని ఆ పాపను తక్షణమే బడిబాట పట్టించాలని పలువురు కోరుతున్నారు. చట్ట విరుద్ధంగా బాలలను పనిలో పెట్టుకొన్న సాయి హోటల్ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు.