calender_icon.png 6 August, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలి

05-08-2025 05:56:25 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా  లబ్ధిదారులు త్వరగా  పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లాలో పైలట్ గ్రామాలైన హసన్ పర్తి మండలం పెంబర్తి, ఎల్కతుర్తి మండలం వీర నారాయణపూర్ లల్లో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన ఆయా గ్రామాల్లోని  లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో కలెక్టర్ మాట్లాడారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి గురించి కలెక్టర్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఇల్లు మొదలు పెట్టని, బేస్మెంట్ వరకు వచ్చి ఆగిన  ఇండ్ల వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ  పైలెట్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు మొదలుపెట్టి ఆరు నెలలు అవుతుందని, ఇంకా ఇండ్ల నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడం సరైంది కాదన్నారు. నిర్మాణ పనులు వేగంగా సాగాలని లబ్ధిదారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం రూ. 5 లక్షలను మంజూరు చేస్తుందని, వివిధ దశలకు ప్రభుత్వం అందిస్తున్నందున లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. బేస్మెంట్ వరకు వచ్చిన ఇండ్ల నిర్మాణ పనులు మరింత ముందుకు సాగాలని, లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు అలాగే నిలిపివేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇండ్ల నిర్మాణ పనులు ముందుకు సాగకపోతే  వాటిని క్యాన్సిల్ చేసి తదుపరి జాబితాలోని అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామన్నారు. లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.