05-08-2025 05:59:44 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లి గ్రామ పంచాయతీ సిబ్బందికి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మామిడి అశోక్ సమకూర్చిన దుస్తులు, బూట్లు, హ్యాండ్ గ్లౌసులను జోనల్ చైర్మెన్ మాధవపెద్ది వెంకట్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం గ్రామ ప్రజలకు సేవ చేస్తున్న జీపీ సిబ్బందికి అశోక్ చేయుతగా నిలవడం పట్ల అభినందించారు.