calender_icon.png 20 September, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం..

20-09-2025 07:04:14 PM

- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి

- బ్యాగ్ ఏ సోయిల్ కో-పౌండర్ మక్కెన గిరీష్ చౌదరి

మునుగోడు (విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గం ప్లాస్టిక్ రహిత జీవనశైలి అవలంబించే విధంగా అవగాహన కల్పించి తెలంగాణకు ఆదర్శ నియోజకవర్గంగా నిలపడమే మా ప్రధాన లక్ష్యమని  బ్యాగ్ ఏ సోయిల్ కో-పౌండర్ మక్కెన గిరీష్ చౌదరి,దాపర్తి కార్తీక్ అన్నారు. బ్యాగ్ ఏ సోయిల్ కో-పౌండర్  శనివారం తహసిల్దారు నేలపట్ల నరేష్, మునుగోడు ఎస్సై ఇరిగి రవికి ఈ అవగాహన కార్యక్రమానికి మద్దతు తెలిపాలని వినతి అందజేసి మాట్లాడారు. బ్యాగ్ ఏ సోయిల్ కంపెనీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించకుండా, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత జీవన విధానాన్ని ప్రోత్సహించేందుకు మునుగోడు నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఒక వ్యక్తి ఒంటరిగా ఒక్క రోజులో మార్పు తేవడం సాధ్యం కాదని అందరి సహకారం అవసరం అన్నారు.

మునుగోడు ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం ప్లాస్టిక్ బ్యాగ్‌ల స్థానంలో పర్యావరణహిత బ్యాగులు వాడాలని కోరారు.అలాగే మాంసం,ఇతర ఆహార పదార్థాల కోసం స్టీల్ బాక్స్‌లు వాడాలని తెలిపారు. బ్యాగ్ ఏ సోయిల్ కర్మాగారం పునాది స్థాయి నుండి కృషి చేస్తూ, ప్లాస్టిక్‌-రహిత, పర్యావరణ హిత మునుగోడు లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉందని అన్నారు.పర్యావరణ పరిరీక్షణే  లక్ష్యంగా  ఈ కార్యక్రమాన్ని తన స్వంత గ్రామం కొంపల్లి నుండి ప్రారంభించినట్లు మక్కెన గిరీష్ చౌదరి తెలిపారు. సామాజిక బాధ్యతకు స్పందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలుపుతూ ప్రోత్సాహం ఇచ్చారని తెలిపారు. మద్దతు తెలిపిన వారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.