15-08-2025 12:59:59 AM
ప్రస్తుతం నీటి నిలువ, ఇన్‌ఫ్లో అంశాలపై ఆరా
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 14 (విజయక్రాంతి) : జిల్లాలో గంభీరావుపేట మండలం భారీ వర్ష సూచన నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టును కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో నీటి నిలువ ఎంత ఉంది.? ఇన్‌ఫ్లో ఎంత ఉంది.? ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఎంత ఉందో? అని నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు. ప్రాజె క్టు పూర్తిస్థాయి నీటి మట్టం రెండు టీఎంసీలని ప్రస్తుతం 1.3 టీఎంసి నీళ్లు ఉన్నాయని ఎగువ నుంచి 400 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
వరద ఇలాగే కొనసాగితే పది రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుందని వారు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో మొత్తం 13 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తుందని, ఎడమ కాలువ కింద 700 ఎకరాలు, కుడికాలువ కింద 12 వేలకు పైన ఎకరాలు సాగు అవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డ్యామ్ గేట్లను పరిశీలించి వాటి నిర్వహణను దగ్గరుండి పర్య వేక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారుల సమయంతో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు నీటిమట్టం అంచనా వేస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిశోర్ కుమార్, ఈఈ ప్రశాంత్ కుమార్, నర్సింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
జగిత్యాల అర్బన్, ఆగస్టు 14 (విజయక్రాంతి) : ధర్మపురిలో గోదావరి నది ప్రవా హం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ గురువారం ధర్మపురి గోదావరి ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సంద ర్భంగా నది వద్ద ప్రస్తుత నీటి మట్టం, ప్రవాహం వేగం, సేఫ్టీ బారికేడ్లు, రక్షణ చర్యలను పరిశీలించారు. భారీ వర్షాల వల్ల ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుండి నీటి ప్రవాహం కొనసాగుతున్న దృష్ట్యా గోదావరి నీటి ప్రవాహం ఉదృతంగా ఉంటుందన్నారు. గోదావరి నది ప్రవాహాన్ని చూడడానికి, నదిలో దిగడం గాని, నది వద్ద సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడం చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ఎవరు కూడా నది వద్దకు వెళ్ళకూడదని ప్రజలకు సూచించారు. ప్రజలు నీటి ఉధృతిని అంచనా వేయకుండా స్నానాలు చేయడానికి నది లోపలికి వెళ్లే ప్రయత్నం చేయవద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఆలయ అధికారులు సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండాలని, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇండియన్ పోలీస్ మెడల్‌కి ఎంపికైన పోలీస్ అధికారులను అభినదించిన ఎస్పీ
పోలీస్ శాఖలో విశేష సేవలందించినందుకుగాను కేంద్రం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపికైన ఇద్దరు పోలీస్ అధికారులను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన స్పెషల్ బ్రాం ఏఎస్‌ఐ రాజేశుని శ్రీనివాస్, మల్యాల పోలీస్ స్టేషన్లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రుద్ర కృష్ణకుమార్‌ను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. రాష్ర్టవ్యాప్తంగా 11 మంది పోలీస్ అధికారులకు ఇండి యన్ పోలీస్ మెడల్ రాగా జిల్లా నుండి ఇద్దరు పోలీసు అధికారులు ఎంపిక కావడం అభినందనీయమన్నారు.