15-08-2025 12:58:52 AM
లంబాడా న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు ధరావత్ దేవా నాయక్
ములుగు, ఆగస్టు14 (విజయక్రాంతి) : దేశంలో ఉన్న బహుజన కులాల యువత రాజకీయాల్లో రాణించాలి అంటే తప్పకుండా రాజకీయాల్లో యువత చేరీ పోటీ పడాలి అని దేవానాయక్ సూచించారు విద్యార్థులు విద్యలో పోటీపడి పరీక్ష వ్రాసిన వారికి అతని శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి అలాగే యువత రాజకీయాల్లో పోటీ పడి గెలిస్తేనే అతని గొప్పతనం సమాజానికి తెలుస్తుంది దేశంలో 90%ఉన్న దళిత బహుజనులు పోటీలో దిగకుండా రిజర్వేషన్ల కోసం పోరాడడం మానేయాలి
స్థానిక సంస్థల లో రిజర్వేషన్లు కల్పించాలని పార్టీలు తప్పు దొవ పట్టిస్తున్నాయి. బిసి రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కానీ శాసన సభకు కాదు అగ్రకులాల జనాభా ఎంత వారికి ఏ రిజర్వేషన్లు ఉన్నాయి వారెందుకు పోటీచేసి గెలుస్తున్నారు దళిత బహుజన కులాల మైన మనము ఐక్యతగా ఉండి రాజకీయాల్లో గెలువాలి బీహర్ ఉత్తరప్రదేశ్ లో బిసిలు దళితులు ముఖ్యమంత్రులు కాలేదా దళిత బహుజన నాయకులు కాన్సిరాం బీపీ మండల్ లాలూ ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ నితీష్ కుమార్ లాంటి నాయకులు ముఖ్య మంత్రులు కాగలిగారు ములుగులో పార్లమెంట్ ఎన్నికల్లో చందూలాల్ రెడ్డి సామాజిక వర్గం నాయకులపై గెలిచారు కదా వారిని ఆదర్శంగా తీసుకుందాం రాబోయే ఎన్నికల్లో దళిత బహుజన వర్గాలను నిజాయితీతో ఓటు వేసి గెలిపించుకుందాం అని దేవా నాయక్ సూచించారు