calender_icon.png 24 October, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులు సమాజ నిర్మాతలు

24-10-2025 12:32:03 AM

  1. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి 
  2. రూ.3లక్షల కోట్ల బడ్జెట్లో రూ. 1100 కోట్లు హెల్త్ స్కీంకు ఖర్చు పెట్టలేరా?
  3. కార్పొరేట్ దవాఖానల్లో జేహెచ్‌ఎస్ అంటేనే బయటికి పంపిస్తున్నారు 
  4. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ 
  5. ర్నలిస్టుల సంక్షేమమే ప్రెస్ అకాడమీ ధ్యేయం
  6. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి

ఎల్బీనగర్, అక్టోబర్ 23 : జర్నలిస్టులు సమాజ నిర్మాతలని, సమాజంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. చైతన్యపురిలోని లిఖిత డయాగ్నటిక్ సెంటర్ సౌజన్యంతో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో గురువారం జర్నలిస్టుల వైద్య శిబిరం నిర్వహించారు. జర్నలిస్టుల మెగా వైద్యశిబిరానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ. కలాన్ని నమ్ముకొని ఉన్నత చదువులు చదివి జర్నలిజంలోకి చాలామంది వస్తున్నారని , వారు సమాజానికి ఏదో సేవ చేయాలని తపనతో రావడం ఆహ్వానించదగ్గ విషయమేనని అన్నారు. కానీ, సినిమా నటుల జీవితాలు లాగా జర్నలిస్టుల జీవితాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ర్ట ప్రభుత్వం రూ, 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరోగ్యం పై రూ,1100 కోట్లు మంజూరు చేయలేకపోతున్నారన్నారు.

అనారోగ్యమై కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే ఈహెఎస్ అంటేనే బయటికి వెళ్లగొడుతున్నారన్నారు. హెల్త్ కార్డు మున్నాళ్ల ముచ్చటగా మారిందని, ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి హాస్పటలో చికిత్స అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులకు, ఇంటి జాగా హెల్త్ కార్డులు వెంటనే అందించాలని అన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...

కరోనా సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ చొరవతో ఎంతోమంది జర్నలిస్టుల ప్రాణాలు నిలిచాయని తెలిపారు. ప్రభుత్వపరంగా హెల్త్ కార్డు, ఇతర పథకాలు జర్నలిస్టులకు అందజేస్తే ఎంతో హర్షిస్తామని తెలిపారు. ఇటీవల కాలంలో ప్రెస్ అకాడమీ నుంచి 102 మందికి రూ. లక్ష తో పాటు ప్రతినెల రూ,3వేల చొప్పున అందజేయడం జరిగిందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు గల 55 మంది జర్నలిస్టులకు రూ,లక్ష, రూ, 2 లక్షలు అందజేశామని తెలిపారు.

ఈ సందర్భంగా జర్నలిస్టుల ఆరోగ్య శ్రేయస్సు కొరకు ముందుకు వచ్చిన లిఖిత డయాగ్నటిక్ సెంటర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద గుప్తా మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేసినా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఖైరతాబాద్ లోని వాసవి హాస్పటల్లో నందు వైద్య శిబిరం ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

టీయూడబ్ల్యూజే రాష్ర్ట అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ...టీయూడబ్ల్యూజే ఎల్లవేళలా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటు పడుతుందన్నారు. సుమారు 80మంది జర్నలిస్టులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సలీం పాషా, కార్యదర్శి మేకల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు మొగిలి నర్సింహ, హెల్త్ క్యాంపు కన్వీనర్ ఆర్.శేఖర్,

చైతన్యపురి కార్పోరేటర్ రంగా నర్సింహ గుప్తా, వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి, లిఖితస్ డయాగ్నటిక్ సెంటర్ ఎండీ డాక్టర్ ఏవీ నాయుడు, టీయూడబ్ల్యూజే రాష్ర్ట కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, నేషనల్ కౌన్సిల్ సభ్యులు టి.ప్రవీణ్ కుమార్, జాల రాధాకృష్ణ, జిల్లా మాజీ అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, కోశాధికారి శశి పాల్, కార్యవర్గ సభ్యులు శ్యామ్ ప్రసాద్, ఆంజనేయులు, సుభాష్ పాల్గొన్నారు.