06-05-2025 12:00:00 AM
జగిత్యాల, మే 5 (విజయక్రాంతి) : రాష్ర్టంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పెగడపల్లి మండలం కీచులాటపల్లిలో రూ. 20 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సోమవారం సాయంత్రం మంత్రి సీతక్క శంకు స్థాపన చేశారు.
పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అ డ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఈ అభివృద్ధి పనుల భూమి పూజలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ర్టం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదన్నారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రైతులకు సరైన మద్దతు ధర అందించేందుకే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు కొన్నారు. సన్నరకం వరి ధాన్యాన్ని ప్రోత్సహించేందుకే ఎకరాకు రూ. 5 వందలు బోనస్ రైతులకు ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా లేని రీతిలో కేవలం తెలంగాణ రాష్ర్టంలోనే పేద ప్రజలకు రేషన్ లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.
6 గ్యారంటీల అమలుతో రాష్ర్టవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళికాయుతంగా సమగ్ర అభివృద్ధి దిశలో నడుపుతున్నామని మంత్రి సీతక్క వివరించారు. అంతకు ముందు మండలంలోని కీచులాటపల్లిలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ నేతృత్వంలో ఇతర జిల్లా ఉన్నతాధికారులు మంత్రి సీతక్కకు పుష్పఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో అధికారులు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన
ధర్మారం, మే- 5 (విజయక్రాంతి) ః తెలంగాణలో సంక్షేమం , అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని రాష్ర్ట పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దాసరి అనసూయ (సీతక్క) అన్నారు.
సోమవారం మంత్రి సీతక్క పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం తెనుగువాడ ధర్మారం నుంచి ఎండపల్లి క్రాస్ రొడ్డు వరకు రూ. 3 కోట్ల 20 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డు పనులను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేసేందుకు ధర్మారం రావడం సంతోషంగా ఉందన్నారు. పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి రెండు కండ్లు లాగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలన కొనసాగిస్తున్నామని అన్నారు.
దేశవ్యాప్తంగా కులగన చేప ట్టాలని రాహుల్ గాంధీ ఆలోచన విధానాలను మొట్టమొదటిసారి అమలు చేసింది తెలంగాణ రాష్ర్టమన్నారు. మన రాష్ర్టంలో చేసిన కులగలను ఆదర్శంగా తీసుకుని కేంద్రం కుల గణన ప్రకటించడం సంతోషకరమన్నారు.
ప్రత్యేక రాష్ర్టం కోసం పోరాటం చేసిన నిరుద్యోగ యువత ను గత పాలకులు విస్మరిస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 60 వేలకు పైగా నియామక పత్రాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఈ. పి.ఆర్.చక్రవర్తి పి.ఆర్. ఈ.ఈ. గిరీష్ బాబు, తహసిల్దార్ వకీల్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఏఈ పి.ఆర్. రాజశేఖర్, అనుదీప్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.