calender_icon.png 4 November, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7 క్వింటాళ్ల కొనుగోలు విధానాన్ని రద్దు చేయాలి

04-11-2025 12:48:46 AM

సీసీఐ మేనేజర్‌కు మాజీ మంత్రి జోగు రామన్న వినతి

ఆదిలాబాద్, నవంబర్ ౩ (విజయక్రాంతి): ఎకరానికి 7 క్వింటాళ్ల కొనుగోలు అనే కొత్త విధానాన్ని మానుకోవాలని, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని తేమ శాతం నిబంధనను తొలగించి పత్తి కొనుగోలు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న డిమాండ్ చేశారు. జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ మంత్రి స్పందించి సోమవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా జిల్లా మేనేజర్ పునీత్ రాఠి ని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వివరించారు.   బేలలో సబ్ మార్కె ట్ కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, యాసం నరసింగ్ రావు, ప్రమోద్ రెడ్డి, లింగ రెడ్డి,  సేవ్వా జగదీష్,కుమ్రా రాజు, పరమేశ్వర్, గణేష్ యాదవ్ పాల్గొన్నారు.