calender_icon.png 10 November, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తైక్వాండో క్రీడాకారులకు కలర్ బెల్ట్‌ల ప్రధానం

10-11-2025 12:54:39 AM

చిట్యాల, నవంబర్ 9 (విజయ క్రాంతి): తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో కలర్ బెల్ట్ పోటీలను చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం  నిర్వహించారు. ఈ యొక్క పోటీలకు  చిట్యాల, రామన్నపేట, నార్కట్ పల్లి మూడు మండలాలనుండి 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నలగొండ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి (డివైఎస్‌ఓ) మహమ్మద్ అక్బర్  ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

వారు మాట్లాడుతూ తెలంగాణ  గవర్నమెంట్ క్రీడా శాఖకు పెద్దపీట వేశారు అని, ఇక్కడ ఉన్న క్రీడాకారులందరూ ఈ యొక్క టైక్వాండో క్రీడలొ జిల్లా, రాష్ర్ట, జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. ఈ సర్టిఫికెట్ 2% స్పోర్ట్స్ కోటలొ వస్తుందని, ఈ సర్టిఫికెట్ను  ఉపయోగించుకొని స్పోర్ట్స్ కోటాలో ఉన్నత చదువులకు గవర్నమెంట్ ఉద్యోగాలకు రిజర్వేషన్ ఉంటుందని, స్పోర్ట్స్ కు సంబంధించి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఆయనను సంప్రదిస్తే, అతను చేసి పెడతానని, క్రీడాకారుల  తల్లిదండ్రులకు  సూచించారు. ప్రతి ఒక్కరూ రెగ్యులర్‌గా క్రీడాకారులని గ్రౌండ్‌కు పంపించాలని, వీళ్లే రేపటి పౌరులన్నారు. అనంతరం బెల్టులు సాధించిన క్రీడాకారులకు బెల్టు ప్రధానం చేశారు. 10 ఎల్లో 05 ఎల్లో వన్ 09 గ్రీన్ 06 గ్రీన్ వన్ 04 బ్లూ 02 బ్లూ వన్ 02 రెడ్ బెల్టులను సాధించారు. మాస్టర్ సుధాకర్, కో పి. పనింద్ర కుమార్, డి వైష్ణవి రెడ్డి పాల్గొన్నారు.