13-10-2025 01:17:37 AM
నేడు ‘షర్మ్ ఎల్ షేక్’లో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం
హాజరుకానున్న 20 దేశాల అధినేతలు
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 12 : ఈజిప్టులోని షర్మ్ షేక్‌లో సోమవారం జరుగనున్న గాజా మధ్య శాంతి ఒప్పందానికి హాజరు కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి భారత ప్రధాని మోదీకి ఆహ్వా నం అందినట్లు జాతీయ మీడియా వర్గా లు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్ సైతం మోదీని ఆహ్వానించిన ట్లు తెలుస్తోంది.
ఆ దేశ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. అమెరికా అధ్యక్షు డు ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షు డు అబ్దేల్ ఫత్తా అల్ మధ్య నేటి మధ్యాహ్నం జరిగే గాజా శాంతి ఒప్పందానికి ఐక్య రా జ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, బ్రిటన్ ప్రధాని కీర్ స్మా ర్టర్, ఇటలీ ప్రధాని జార్జి యా మెలోని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మె క్రాన్ సహా 20కి పైగా దేశాలకు చెందిన నేతలు హజరయ్యే అవకాశం ఉంది. అ యితే, అమెరికా భారత్ మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, వీసా గడువు పెంపు నేపథ్యంలో ట్రంప్ నుంచి మోదీ కి ఆహ్వానం అంద డం ప్రాధాన్యం సంతరించుకుంది.