calender_icon.png 13 October, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాటానికి వెనుకాడం!

13-10-2025 01:19:40 AM

  1. సుంకాల విషయంలో అమెరికావి ద్వంద్వ ప్రమాణాలు 
  2. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలు తమ దేశ ప్రయోజనాలకు హానీ
  3. అగ్రరాజ్యం సుంకాల మోతపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆగ్రహం

బీజింగ్, అక్టోబరు 12:  సాధారణంగా తాము ఎవరితో ఘర్షణకు దిగ మని.. అవసరం వస్తే పోరాడటానికి వెనుకాడబోమని చైనా వాణిజ్య మం త్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చైనా దిగుమతులపై 100శాతం సుంకాలు విధిస్తున్న ట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై  తాజాగా చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలతో తమ దేశ ప్రయోజనాలకు తీవ్ర హాని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవి ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది. అయితే, చర్యలకు ప్రతి చర్యలు తప్పక ఉంటాయని సుతిమెత్తగా అగ్రరాజ్యానికి హెచ్చరిక జారీ చేసింది. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనా దిగుమతులపై వంద శాతం సుం కాలు విధిస్తూ, నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించారు. దీనిపై చైనా తీసుకునే నిర్ణయాలపైనే తదుపరి చర్యలు ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు.