22-10-2025 06:42:45 PM
హైదరాబాద్: రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తు ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 31 నుండి అమల్లోకి వచ్చేలా ఐఎఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. వాణిజ్య పన్నుల కమిషనర్ ఎం. రఘునందన్ రావును రెవెన్యూ (వాణిజ్య పన్నులు & ఎక్సైజ్) శాఖ కార్యదర్శి పదవి బాధ్యతలు అప్పగించారు.
టీజీజీఈఎన్ఓ సీఎండీ(TGGenco CMD)గా ఉన్న ఎస్. హరీష్ ను ఎండోమెంట్స్ డైరెక్టర్ గా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ITE&C) శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రాకు ప్రభుత్వ అదనపు బాధ్యతలు, గనులు-భూగర్భ శాస్త్ర డైరెక్టర్ పదవి అప్పగించింది. దేవాదాయ శాఖ నుంచి శైలజా రామయ్యర్ ను తప్పించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, ప్రస్తుతం ఉన్న వల్లూరు క్రాంతిని ఎఫ్ఎసీ నుండి తొలగించారు. ప్రస్తుతం సిద్దిపేట అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా సేవలందిస్తున్న గరిమా అగర్వాల్‌ను బదిలీ చేసి రాజన్న-సిర్సిల్ల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నియమించారు.