23-10-2025 12:00:00 AM
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆహ్వానం
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 2026 జనవరి 3 నుంచి 5వ వరకు గుంటూరులోని అమరావతి శ్రీసత్య సాయి స్పిరచువల్ సిటీ ప్రాం గణం (హైవే)లో శ్రీ నందమూరి తారకరామారావు వేదికపై నిర్వహించే 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు 5వ తేదీ సాయంత్రం జరిగే సమాపనోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడును- ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్.. తన సతీమణి సురేఖతో సహా బుధవారం హైదరాబాద్‌లో కలిసి ఆహ్వానించారు. వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించారని డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు.