calender_icon.png 23 October, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సొంతింటి కల ప్రభుత్వ లక్ష్యం

23-10-2025 12:00:00 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల శంకుస్తాపన 

తలకొండపల్లి,అక్టోబర్ 22: రాష్ర్టంలోని నిరుపేదల సొంతింటి కళను నెరవేర్చడమే కాంగ్రేస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన పోతుగంటి మాదవి,సిద్దమ్మ,నూకం నర్సమ్మ లకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి బుదవారం కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి చేతుల మీదుగా శంకుస్తాపన చేశారు.గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా పేదలకు అన్యాయం చేసిందని విమర్శించారు.కాంగ్రేస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కొంద నిర్మిస్తున్న ఇండ్లకు ఎస్సీలకు రూ 6లక్షలు,ఇతరులకు రూ.5లక్షల చొప్పున అందిస్తుందని చెప్పారు.

పేదలందరికి విడతల వారిగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి వారి కల నెరవేర్చడమే రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్యేయమని అన్నారు.లబ్దిదారులకు ఎమ్మెల్యే నారాయణరెడ్డి మంజూరు పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ జిల్లా,మండల,గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.అనంతరం మండల కేంద్రానికి చెందిన పోచారం గిరిదర్ రెడ్డి ఏర్పాటు చేసిన హాక రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ద్వార హాక రైతు సేవా కేంద్రాలు మంజూరైనట్లు చెప్పారు.ఈ కేంద్రాల ద్వార రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువులు పొందవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ర్ట బిసిబి మెంబర్ బాలాజీసింగ్,మార్కెట్ కమిటి సభ్యులు అంజయ్యగుప్త,నాయకులు మోహన్ రెడ్డి,యాదగిరి,పాండు,మల్లేష్,గణేష్,రవీందర్,రమేష్ కుమార్,కృష్ణ,రాజురెడ్డి లు పాల్గొన్నారు.