25-05-2025 12:00:00 AM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 30న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై చిత్ర విశేషాలను పంచుకున్నారు.
-నాకు కమర్షియల్ హీరోగా మంచి పేరు వచ్చింది. తర్వాత కొన్ని స్టైలిష్ సినిమాలు చేశా. అప్పుడు మాస్ కనెక్ట్ అవుతున్నారా లేదా అనిపించేది. అందరూ రిలేట్ చేసుకునే రూరల్ స్టోరీ చేయాలనుండేది. అప్పుడే ఈ కథ దొరికింది. ఈ కథను మన సెన్సిబిలిటీస్‌కి తగ్గట్టు ప్రజెంట్ చేసే గల దర్శకుడు విజయ్ కనకమేడల అనిపించింది. ‘భైరవం’ రీమేక్‌లా కాకుండా స్ట్రుటై సినిమాగానే చూడాలి. ఎందుకంటే డైరెక్టర్ తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు అన్ని మార్పులూ చేసి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. -ఈ సినిమాలో హీరో కొలిచేది కాలభైరవుడ్ని. కథలో నుంచే ఈ టైటిల్ వచ్చింది.
-మొదట నేనే కథను ఎంపిక చేసుకుంటా. తర్వాత నాన్న అభిప్రాయం అడుగుతా. ఆయన జడ్జిమెంట్ చాలా బావుంటుంది. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలు చేయడం ఇష్టం. చిన్నట్నుంచి అలాంటి సినిమాలు చూస్తూనే పెరిగాను. మనం థియేటర్‌లోకి వెళ్లిన తర్వాత మన కష్టాలు మర్చిపోవాలి. కమర్షియల్ సినిమాల్లోనూ కొత్తదనం ఉండాలి. అల్లుడు శ్రీను, జయ జానకీ నాయక.. ఇవన్నీ కొత్త పంథాలో సాగిన సినిమాలే. ప్రతి సినిమాలో ఒక కొత్తదనం ఇవ్వడానికే ప్రయత్నిస్తా.
-రోహిత్, మనోజ్ ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తు న్నారు. నేను, మనోజ్, రోహిత్ సినిమాలకు కొంతకాలంగా బ్రేక్ ఇ చ్చిన వాళ్లమే. ఇందులో క్యారెక్టర్స్‌ను చూస్తున్నప్పుడు తప్పకుండా అందరూ చాలా ఫ్రెష్‌గా ఫీల్ అవుతారు.
-ఈ సినిమా ట్రీట్‌మెంట్ చాలా కొత్తగా ఉంటుంది. ఒకవేళ తమిళ్ వెర్షన్ చూసినవాళ్లకు కూడా ఈ సినిమా చాలా నచ్చుతుంది. కేవలం ఆ సినిమా సోల్‌నే తీసుకొని తెలుగు ప్రేక్షకు లకు తగ్గట్టుగా అద్భుతంగా మలిచారు.
-దాదాపు నాలుగు ఏళ్లు గ్యాప్ వచ్చింది. ‘-హైందవ’ స్క్రిప్ట్ ఓకే చేసి దాదాపు మూడేళ్లవుతోంది. అది నాకు చాలా పాషనేట్ ప్రాజెక్టు. ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’ తర్వాత ఇంకేదీ చేయకూడదనుకున్నా. అనుకోకుండా ‘భైరవం’, ‘కిస్కిందపురి’ కథలు నా దగ్గరకు వచ్చాయి. ‘కిష్కిందపురి’ చాలా కొత్త జోనర్. విభిన్న సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నా. భైరవం, టైసన్ నాయుడు, హైందవ, కిష్కిందపురి.. దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. పూరి జగన్నాథ్ నేను -ఒకట్రెండుసార్లు కలిశాం. కచ్చితంగా సినిమా ప్లాన్ చేస్తాం.