30-09-2025 12:02:09 AM
రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రేగుంట కేశవ్ రావ్
కుమ్రం భీం ఆసిఫాబాద్,సెప్టెంబర్ 29(విజయక్రాంతి):రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రేగుంట కేశవ్ రావ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం రేషన్ డీలర్లు నిరసన చేపట్టారు. రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్షుడు రేగుంట కేశవ్ రావ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో ఆడుకుంటున్నాయన్నారు.
మేము ప్రజలకు ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తున్నా, ఇచ్చే కమిషన్తో కుటుంబాలను పోషించలేకపోతున్నమని , ఇప్పటికే 6 నెలల కమిషన్ బకాయిలు ఉన్నా చెల్లించకపోవడం తో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.బతుకమ్మ, దసరా, దీపావళి వంటి పెద్ద పండగలకు కనీ సం కుటుంబాలకు బట్టలు కొనడానికైనా డబ్బులేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రేషన్ డీలర్లకు రూ.5000 గౌరవ వేతనం ఇస్తామ ని హామీ ఇచ్చినా ఇప్పటిదాకా అమలు చేయలేదని ఆరోపించారు. కింటాల బియ్యానికి రూ.300 కమిషన్ ఇస్తామని చెప్పినా అమ లు కాలేదన్నారు. రేషన్ డీలర్లకు హెల్త్ కార్డు లు, రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించించాలని,
ఎమ్మెల్సీ పాయింట్ వద్ద తూకంలో తక్కువ రాకుండా వెబ్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని, హమాలీ చార్జీలు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేరు శేషగిరిరావు, ఉపాధ్యక్షుడు పైడి పురుషోత్తం, కోశాధికారి జాడే ఆత్మరావు ,జిల్లాలోని డీల ర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.