calender_icon.png 9 May, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన కమిషనర్

09-05-2025 01:34:42 AM

కరీంనగర్, మే8(విజయక్రాంతి); కరీంనగర్ డంపింగ్ యార్డ్ తో ప్రజలు  ఎడిర్కొంయున్న ఇబ్బందులు  ప్రజా ఉద్యమాలపై విజయక్రాంతి  ప్రచురించిన కథనానికి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ స్పందించారు.

డంపుయార్డును ప్రక్షాలన చేసేందుకు నగరపాలక సంస్థ ద్వారా ప్రత్యేక చర్యలు తీస్కుంటున్నట్లు కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ తెలిపారు. కరీంనగర్ నగరంలోని బైపాస్ రోడ్డులో గల నగరపాలక సంస్థ చెత్త డంపింగ్ యార్డును అధికారులతో కలిసి సందర్శించారు. డంపింగ్ యార్డు ప్రస్తుత పరిస్థితిని తనిఖీ చేసి పరిశీలించారు.

డంపు యార్డు ప్రక్షాలనలో బాగంగా గతంలో ఏర్పాటు చేసిన బయోమైనింగ్ ప్రక్రియతో పాటు స్థానికంగా ఉన్న డీఆర్ సీసీ సెంటర్ ను తనిఖీ చేశారు. బయోమైనింగ్ ప్రాసెస్ పై అధికారులకు, ఏజెన్సీ కాంటాక్టర్ కు సూచనలు చేసి ఆదేశాలు జారీ చేశారు. డంపు యార్డుకు వస్తున్న చెత్తను తగ్గించేందుకు తీస్కోవల్సిన చర్యల పై అధికారులు, సిబ్బందితో చర్చించారు.