26-08-2025 02:06:35 AM
- దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర ఆగస్టు 25 : ప్రజలు కోరుకున్న అభివృద్ధి చేయడమే మా సంకల్పమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. దేవరకద్ర పట్టణంలో మహబూబ్ నగర్ - రాయచూర్ రోడ్డు నుండి పట్టణంలోకి వెళ్లే సర్వీస్ రోడ్డు నిర్మాణానికి రాయచూర్ వైపు సబ్ వర్క్ పనులకు సోమవారం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేసే అదృష్టం రావడం వరంగా భావిస్తున్నానని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ముందుకు సాగుతున్నమని తెలిపారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.