21-07-2025 12:33:39 AM
ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఆదిలాబాద్, జూలై 20 ( విజయ క్రాంతి ) : జీవితాంతం ఆదివాసీ హక్కులకై పోరాడిన మలిదశ ఉద్యమ కారుడు సిడం శంభు ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఆదివారం ఉట్నూర్ మండలంలోని మత్తడి శంభుగూడలో సిడం శంభు 7వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా సిడం శంభు సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ... సిడం శంభూ ఆదివాసీల కోసం అహర్నిశలు కృషి చేశారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలు పునిచ్చారు. సమాజ హితం కోసం పాటు పడిన ఉద్యమ నాయకుడి కుటుంబానికి మనమంతా కలసి అండగా నిలబడాలన్నా రు. ఈ కార్యక్రమంలో సిడం శంభు కుటుంబీకులు, ఆదివాసీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.