calender_icon.png 13 August, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిస్టు పోరాట యోధుడు అయోధ్య మృతి

07-08-2025 12:56:48 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 6, (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బి.అయోధ్య బుధవారం తెల్లవారుజామున సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాదులో వైద్యం చేయించుకొని గురువారం జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతుండగా ప్రమాదానికి గురై అయన మృతిచెందారు, డ్రైవర్ రమేషుకు తీవ్రగాయాలయ్యాయి.

సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యాలయం ’శేషగిరిభవన్’కు పార్టీ శ్రేణుల సందర్శనార్ధం తరలించారు. సిపిఐ, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయపక్షాల నాయకులు అయోధ్య మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కమ్యూనిస్టు నేతగా ప్రేత్యేక స్తానం సంపాదించుకున్నాడని, జిల్లా రాజకీయాలను శాశించే స్థాయికి కమ్యూనిస్టు పార్టీని తీసుకెళ్లాడన్నారు.

మణుగూరు ప్రాంతంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కమ్యూనిస్టు పార్టీని నిలిబెట్టి, కార్యకర్తలకు అండగా నిలిచారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, ప్రజాప్రతినిధిగా పనిచేసి ప్రజలకు యెనలేని సేవలందించారన్నారు. ప్రజా పోరాటాలకు, భూపోరాటాలకు అయోధ్య నాయకత్వం వహించారన్నారు. భద్రాద్రి జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఒక బలమైన నాయకున్ని కోల్పోయిందని, అయోధ్య మృతి ప్రజా ఉద్యమాలకు, కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని, అయన ఆశయాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం కొత్తగూడెం పట్టణ పురవీధులమీదుగా భారీ ఊరేగింపుతో విడ్కోలు పలికారు. నివాళిలర్పించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, మైనార్టీ సంఘాల రాష్ట్ర నాయకులు నయీమ్ ఖురేషి, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్ద బిక్షం, కాంగ్రెస్ నాయకులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, వీసంశెట్టి పూర్ణచందర్ రావు, భూక్యా దస్రు, వాసిరెడ్డి మురళి, యు.రాహుల్, ఎస్ కె ఫహీమ్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, జి వీరాస్వామి, మునిగడప వెంకటేశ్వరరావు, గెద్దాడు నగేష్, భూక్యా శ్రీనివాస్, కోమారి హన్మంతరావు, జక్కుల రాములు, పద్మ, ధనలక్ష్మి, దార శ్రీను, అబిద్, తదితరులు పాల్గొన్నారు.