calender_icon.png 26 September, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి: సీపీ

26-09-2025 12:26:58 AM

బెల్లంపల్లి, సెప్టెంబర్ 25 : పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురు వారం వార్షిక తనిఖీలో భాగంగా బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. టూ టౌన్ పరిధిలో జరుగుతున్న నేరాలు, తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగా హన కల్పించాలని సూచించారు.

నేర నియంత్రణపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ లో ఫైళ్ళు, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పరిసరాలను పరిశీలించి ఎస్త్స్ర కిరణ్ కుమార్ ను అభినందించారు. సిపి వెంట మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసీపి రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.