26-09-2025 12:25:34 AM
నిర్మల్ జిల్లాకు చేరిన 25 లక్షల గోనె సంచులు
దసరా తర్వాత ప్రారంభించేందుకు చర్యలు
కొనుగోలు అక్రమాలకు పాల్పడితే చర్యలకు సిద్ధం
నిర్మల్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలను పక్కాగా ప్రణాళిక బద్ధంగా చేపట్టేందుకు అధికారులు ప్రత్యేక కార్యచరణలను రూపొందిం చారు. ఇప్పటికీ వానాకాలం సీజన్‌లో రైతులు సాగుచేసిన వరి ధాన్యం అక్టోబర్ కోతకు రానున్న నేపథ్యంలో కొనుగోలను వెంటనే చేపట్టే విధంగా ప్రభుత్వం ఆదేశించింది.
నిర్మల్ జిల్లాలో ఈ సీజన్లో 1.27 లక్షల ఎకరాల్లో వరి సావుకావుగా 2.10 లక్షల మె ట్రిక్ టన్నుల వారి ధాన్యం వస్తుందని అం చనా వేస్తున్నారు. ఇందులో దొడ్డు ధాన్యం1, 48,959 మెట్రిక్ లక్షలు, సన్న రకం దానం61, 106 లక్షల మెట్రిక్ టన్నులు ఉం టుందని అంటున్నారు.
జిల్లాలో మొత్తం 357 వర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకెపి ద్వారా 173 పిఎసిఎస్ ద్వారా 149 డీసీఎంఎస్ ద్వారా 24 గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు 2385 రూపాయలు చెల్లిస్తుండగా సన్న రకం ధాన్యానికి అదనంగా 500 బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది
నాణ్యతగా పకడ్బందీగా..
నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలను నాణ్యతగా పకడ్బందీగా కొనుగోలు చేపట్టి వెంట వెంటనే గోదాములకు తరలించే విధం గా అధికారులు చర్యలు చర్యలు తీసుకొని ఉన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధ్యక్షతన కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు జిల్లా అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్ సివిల్ సప్లై డిఎం సుధాకర్ ట్రాన్స్పోర్ట్ అధికారి దుర్గాప్రసాద్ నేతృత్వం లో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల సమావేశం చర్యలు చేపట్టారు.
కొనుగోళ్లకు అవసరమయ్యే గోలసంచల కోసం ప్రతిపాదనలు పంపగా మొత్తం 52 లక్షల గోనె సంచులకుగాను జిల్లాకు 25 లక్షలు చేరుకున్నాయి. వీటిని మండలాల వారిగా పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ మిషన్ ప్లాడి క్లీనర్ మిషన్లను అందుబాటులో ఉంచుతున్నారు. కేంద్రాల వద్ద విద్యుత్తు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
ధాన్యం టూకం వేసిన వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ గోదాములకు తరలించే విధంగా ఏజెన్సీ నిర్వాహకులకు సూచనలు చేశారు. డబ్బులు చెల్లించేందుకు జాప్యం జరగకుండా మాంటింగ్ చేయనున్నారు. ధాన్యం కొనుగోలు అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా నాణ్యత లేని దాన్యం కొనుగోళ్లపై ఈసారి కఠినంగానే వ్యవహరించాలని జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం సూచించింది.
ఇప్పటికే బీహార్ కూలీలకు సమాచారం ఇచ్చి ఏజెన్సీ నిర్వాహకులు వారిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునే విధంగా జిల్లా యంత్రాం గం ప్రత్యేక కార్యచరణతో ముందుకు పోతుంది. తూకం చేసిన ధాన్యాన్ని వెంట వెంట వెంటనే గోదాములకు తరలించే విధంగా లారీలను అందుబాటులో ఉంచరున్నారు. గత సీజన్లో ఎదురైన లోపాలను సరిదిద్దుకుంటూ ఈసారి తొందరగా కొనుగోలు ప్రారంభించి ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది
జిల్లాకు 25 లక్షల గన్ని బ్యాగులు
నిర్మల్ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారి ధాన్యం కొనుగో లు దాన్యం తరలింపుకు ప్రత్యేక కార్య చరణతో ముందుకు పోతున్నాం. జిల్లా లో 357 కేంద్రాలను ఏర్పాటు చేసి 2.10 లక్షల మెట్ల టన్నుల దాన్యం కొనుగోలు చేసినందుకు 25 లక్షల గోనె సం చులు జిల్లాకు చేరుకున్నాయి మరో వా రం రోజుల్లో 27 లక్షల గన్ని బ్యాగులు జిల్లాకు రానున్నాయి. కొనుగోలను పారదర్శకంగా చేపట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం.
సీహెచ్ సుధాకర్, సివిల్ సప్లై డీఎం