calender_icon.png 26 September, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

26-09-2025 12:27:23 AM

రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, సెప్టెంబరు 25 (విజయ క్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్ తెలిపారు. శుక్రవారం శాతవాహన యూనివర్సిటీ లో 20 కోట్ల రూపాయల వ్య యంతో నూతన గిరిజన బాలుర ,బాలికల వసతి గృహాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మార్క్ ఫేడ్ చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి తో కలిసి 200 ఎకరాల్లో శాతవాహన యూనివర్సిటీ తెచ్చుకున్నామని తెలిపారు.

హాస్టల్ కి 20 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధన్యవాదా లు తెలిపారు. 10 సంవత్సరాలుగా తెలంగా ణ ఏర్పడిన తరువాత శాతవాహన యూనివర్సిటీ అద్భుతంగా అభివృధి జరుగుతుందని భావించాం.. కానీ గత పాలకుల చేతిలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఆనాడు మేము పెట్టిన కాంపౌండ్ , మొక్కలు మేము చేసిన అభివృద్ధి తప్ప ఏమి చేయలేదు..కొత్తగా ఒ క్క విద్యాసంస్థ తేలేదన్నారు. ఇప్పుడు ప్రజా పాలన ప్రభుత్వం లో హుస్నాబాద్ కి ఇంజనీరింగ్ కాలేజి, కరీంనగర్ కి లా కాలేజి, ఫార్మసీ కాలేజీ లు తెచ్చుకున్నామన్నారు. గ త ప్రభుత్వంలో అన్ని జిల్లాల తరువాత కరీంనగర్ కి ప్రభుత్వ మెడికల్ కాలేజీ వచ్చిందని, గత ప్రభుత్వం లో నిర్లక్ష్యానికి గురైందన్నా రు.

గతంలోనే కోరుట్ల కి వ్యవసాయ కాలేజి, పెద్దపల్లి కి ఇంజనీరింగ్ కాలేజి తెచ్చుకున్నామని, ప్రభుత్వం సంక్షేమం అభివృధి కార్య క్రమాలు ముందుకు తీసుకుపోతున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న అనేక కార్య క్రమాలు చేస్తున్నామని, రాబోయే కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేలా పని చేస్తామన్నారు. మౌలిక వసతులు ప్రభుత్వం నుండి ఏర్పాటు చేస్తామని, మంచి నాణ్యమైన విద్య అందించాలని వీసీనీ కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా దేశ విదేశాల్లో ఇక్కడికి అడ్మిషన్లు పొందేలా ఎదగాలన్నా రు.

ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మొదటి 100 ర్యాంకులు కూడా శాతవాహన యూనివర్సి టీ లోనే తీసుకుంటాం అనే విధంగా పోటీ పడాలన్నారు. మాతృదేవో భవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రులతో సమానంగా గౌరవిస్తారు.. మీరు వారి అభివృద్ధికి మరింత పని చేయాలని కోరారు. అ నంతరం హుస్నాబాద్ నియోజకవర్గంలో గిరిజనుల అభివృద్ధి కొరకు గిరిజన సంక్షేమ శాఖ నుండి 125 కోట్ల రూపాయలకు కేటాయించాలని కోరుతూ మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా స త్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశా య్, వీసీ ఉమేష్ కుమార్, సుడా చైర్మన్ న రేందర్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, తదితరులుపాల్గొన్నారు.