20-07-2025 12:51:36 AM
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పట్ల సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ నాయకురాలు సుమిత్రానంద్ నేతృత్వంలోని బృందం ఫిర్యాదును చేసింది.
అయితే సర్వర్ డౌన్ పేరుతో ఫిర్యాదు స్వీకరణ పత్రాన్ని ఇవ్వడానికి బంజారాహిల్స్ పోలీసులు నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుమిత్రానంద్ ఫిర్యాదు స్వీకరణ పత్రాన్ని ఇచ్చే వరకు స్టేషన్‌లోనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.