calender_icon.png 21 July, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనంపల్లికి రాజకీయ పునర్జన్మ ఇచ్చిందే కేటీఆర్

20-07-2025 12:51:35 AM

  1. అందుకే మైనంపల్లి కేటీఆర్ కాళ్లు మొక్కారు: ఎమ్మెల్యే వివేకానంద
  2. హన్మంతరావుకు పదవులిచ్చిందే బీఆర్‌ఎస్: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి ట్రాప్‌లో పడి మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతున్నారని, రాజకీయ పునర్జన్మ ఇచ్చినందుకు మైనంపల్లి కేటీఆర్ కాళ్లు మొక్కారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు. కేటీఆర్ సీఎం కావాలను కుంటే ఎప్పుడో అయ్యేవారన్నారు. పదేళ్లూ సీఎంగా ఉండటానికి నువ్వెవరని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారన్నా రు.

పాలనలో పట్టులేని సీఎం శాంతిభద్రతల విషయంలో అట్టర్ ప్లాఫ్ అయ్యార న్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివేకానంద మాట్లాడుతూ అధికారం ఉందని మైనంపల్లి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యం లో దాడులకు, బెదిరింపులకు తావులేదని వివేకానంద పేర్కొన్నారు.

మితిమీరి వ్యవహరిస్తున్న అధికారులు, నాయకులకు ఖచ్చితం గా సమాధానం చెప్తామని, టీడీపీలో టిక్కెట్ దక్కకపోతే కేటీఆర్ మైనంపల్లి హనుమంతరావుకు 2014 లో మల్కాజిగిరి ఎంపీ టిక్కె ట్ ఇచ్చారని, ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు. మైనంపల్లికి దమ్ము, ధైర్యం, ఆధారాలు ఉంటే కేటీఆర్‌పై చేసిన ఆరోపణలు నిరూపించాలని కోరారు.

బీఆర్‌ఎస్ పార్టీకి చెంది న బలహీనవర్గాల కార్పొరేటర్లపై అక్రమ కేసులు పెట్టారని వివేకానంద ఆరోపించారు. వ్యక్తిగతదాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మైనంపల్లి మానుకోవాలన్నారు. మీరు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్కొన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు ఇంటిపై దాడులు చేస్తే చూస్తూ ఊరు కుంటామా అన్నారు. సమైక్య రాష్ర్టంలోనే వాళ్లను ఎదిరించామన్నారు.

రేవంత్‌రెడ్డి వేసే ఎంగిలి మెతుకుల కోసం మైనంపల్లి మాట్లాడుతున్నారని, మైనంపల్లికి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్, ఎమ్మెల్సీ, గ్రేటర్ అధ్యక్ష పదవి బీఆర్‌ఎస్ ఇచ్చిందన్నారు. పోస్టింగుల కోసం, పైరవీల కోసం పోలీసుల స్థాయిని తగ్గించుకోవద్దన్నారు. సమావేశంలో ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు నంది కంటి శ్రీధర్, చిరుమళ్ల రాకేశ్‌కుమార్ పాల్గొన్నారు.