calender_icon.png 21 July, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేల్పూర్ గురుకుల విద్యార్థి సూసైడ్

20-07-2025 12:52:59 AM

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఘటన

నిజామాబాద్, జూలై 19 (విజయక్రాంతి): నిజా మాబాద్ జిల్లా వేల్పూర్ గురుకుల పాఠశా లలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి శనివారం ఆత్మహత్మ చేసుకున్నాడు. ఈ ఘటన ఆర్మూర్ పట్టణ శివారులో శనివారం చోటు చేసుకుంది. వేల్పూర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న గడ్డం సంతోష్ (17) కశాశాల పక్కనే ఉన్న నర్సరీలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికు లు వేల్పూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంతోష్ తండ్రి దుబాయ్‌లో ఉంటున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.