28-09-2025 12:32:57 AM
మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీ పరిధిలో గల కూచిరాజ్ పల్లి గ్రామ శివారులో నూతన ప్లాటింగ్ వెంచర్ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కు బోయిని పేటకు చెందిన నాయిని సంతోష్ శనివారం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు లో కూచిరాజ్ పల్లి లో సర్వే నెంబర్ (27)గల ప్రభుత్వ భూమి, నిరుపేద ధళితులకు చెందిన ఆబాధి భూమిని కొందరు వ్యక్తులు అక్రమ పట్టాలు సృష్టించి ఫ్లాటింగ్ నిర్మాణం చేపట్టార్నారు.
వెంచర్ కి సంబంధించిన పూర్తి సర్వే నెంబర్ లు అన్ని సేతు వారు రికార్డుల్లో, కాస్ర రికార్డుల్లో ఆబాది భూమి, గవర్నమెంట్ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉందిహని, ఈ వెంచర్ ఫ్లాటింగ్ తల్లాగు బఫర్ జోన్లలో నిర్మాణం చేయడం జరిగిందని, ఈ యొక్క ఫ్లాటింగ్ వెంచర్ కి 27 సర్వే నెంబర్ లో గల భూమిలో కొంతమంది దళితులకు ఆ యొక్క భూమి ఉన్నట్టుగా సేతివారు రికార్డు చెపుతుందన్నారు. ప్లాటింగ్ వెంచర్ లో ఆబాది భూమి కూడా 6 ఎకరాలు ఉన్నట్టుగా కాస్ర రికార్డు చెబుతుందని, అక్రమ దారులు కొందరు కబ్జా చేసుకొని ఈ ఫ్లాటింగ్ వెంచర్ నిర్మాణం చేయడం జరుగుతుంది.
ఈ వెంచర్ ల యొక్క నిర్మాణ పనులు నిలిపివేసి తిరిగి సర్వే నిర్వహించాలని, అక్రమ ఫ్లాటింగ్ వెంచర్ పై పర్మిషన్స్ రద్దు చేస్తూ, ప్లాటింగ్ వెంచర్ కు సంబంధించిన సర్వే నెంబర్ లు అన్నిటిని కూడా ప్రతి రికార్డులను పరిశీలించి, విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని, ఈ వెంచర్ నిర్మాణం చేసిన నిర్వాహకులపై పూర్తి దర్యాప్తు చేపట్టి లబ్ధిదారులకు న్యాయం చేయాలని నాయిని సంతోష్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.