28-09-2025 12:28:28 AM
అచ్చంపేట: అచ్చంపేటలో ఈనెల 28న జరగనున్న బీఆర్ఎస్ జన గర్జన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట పార్టీ ఇంచార్జ్ మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల నుండి భారీగా ప్రజలు తరలి రానున్నారని, వర్షాలు అంతరాయం కలగకుండా భారీ టెంట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయారని, ఈ సభతో బీఆర్ఎస్ పునరాగమనం కోసం సంకేతం పలకనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా "ఛలో అచ్చంపేట జనగర్జన" వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జనార్దన్ రెడ్డి, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.