calender_icon.png 16 July, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కార్యాలయంలో అవినీతి

15-07-2025 08:23:15 PM

ప్రెస్ క్లబ్ లో సాహద్యోగి నయీముద్దీన్ వెల్లడి

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతుందని సాహద్యోగి నయీముద్దీన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అహ్మద్ అక్రమాల చిట్టా బయట పెట్టారు. మున్సిపల్ కమిషనర్ పెద్ద అవినీతిపరుడని పేర్కొన్నారు. చేయి తడపందే ఏ పని చేయడని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అనుచరులుగా నియమించి కార్యాలయంలో దందా మొదలెట్టాడని తెలిపారు. సాయంత్రం కాగానే ఏజెంట్ల నుంచి వచ్చిన కలెక్షన్ వసూలు చేస్తాడని మున్సిపల్ కమిషనర్ అక్రమాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదన్నారు.నచ్చిన ఉద్యోగులకు చేరదీసి నచ్చని వారిని వేధిస్తాడని ఆరోపించారు.