15-07-2025 08:28:52 PM
మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్
మేడిపల్లి,(విజయక్రాంతి): సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రతి పేదోడి కలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 12వ డివిజన్ లో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బోడుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నర్సింహ్మరెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం నుంచి చెక్కులను పంపిణీ చేయిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఇల్లు లేని వారు ఉండకూడదనే లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా ప్రజా ప్రభుత్వం 5 లక్షలు మంజూరు చేస్తుందని,లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారందరికీ ఇండ్లు మంజూరు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.