16-09-2025 12:08:09 AM
జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి):ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగ్రవాల్, అబ్దుల్ హమీద్ లతో కలిసి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేసి అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో పరిష్కారం కోసం 152 దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ నాగ రాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.