22-01-2026 12:00:00 AM
స్వతంత్ర భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత మన ప్రజాస్వామ్య మూలస్థంభాల పనితీరును, పటిష్టతను పెంపొందించుకోవడం కోసం జాతీయ నాయకులు దేశ పరి స్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య దేశంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు పునాది. ఓటు హక్కు, ఓటు విలువ, ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన చైతన్యం కలి గించడం ద్వారానే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న ఓటర్లతో మమేకమయ్యేందుకు సదస్సులు, కళాశాల విద్యా ర్థులు, యువతతో ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ‘బలమైన ప్రజాస్వామ్యం కోసం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ’ అనే నినాదంతో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రక్షాళన చర్యలను మొదలుపెట్టిన ఎన్నికల కమిషన్ (ఈసీ) తన పనిని నిర్విరామంగా చేసుకుంటూ వెళుతున్నది.
అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు నిండిన జాతీయ పౌరులకు ఓటుహక్కు కల్పించారు. కుల, మత, లింగ, ప్రాంత, ధనిక, పేద, వివక్ష లేకుండా అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు సార్వత్రిక వయో జన ఓటు హ క్కు కలిపించి ప్రపంచ రాజకీ య చరిత్రలో గొప్ప విప్లవాత్మకమైన మా ర్పుకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందే వర్ధమాన దేశంగా చెప్పుకునే మన దేశంలో వయోజన ఓటింగ్ హక్కు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసింది. ఓటు హక్కు అందరికీ వజ్రాయుధంగా మారిపోయింది. ప్రభుత్వాల ఏర్పాటులో ఓటర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఓటుహక్కు అనేది సామాన్యుని గొంతుకగా నిలిచింది. తమకు నచ్చిన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అధికారం ప్రజా స్వామ్యం మన ఓటర్లకు కల్పించింది.
కనువిప్పు కలిగినప్పుడే..
ఓటు ద్వారా ప్రజాప్రతినిధులను ప్రశ్నిం చే హక్కు ఓటర్లకు సంక్రమించింది. కానీ ఓటు హక్కు ద్వారా ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కును మాత్రం కోల్పోయాడు. ఏదో ఒక తాయిలాలకు లొంగిపోతున్నాడనేది చారిత్రక సత్యం. ప్రజలే ప్రభువులు అన్న అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింక న్ అభిప్రాయం ప్రకారం.. ప్రజల చేత, ప్రజ ల కొరకు నిర్వహించబడే ప్రజా ప్రభుత్వాన్ని ‘ప్రజాస్వామ్యం’ అని నిర్వచించారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు అన్న ప్రభుత్వ విధానంలో ఉండాలి. ఓటు హక్కు ద్వారా ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తారు. ప్రజాస్వామ్య మనుగడకు ఓటే పునాది.
ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తూ ఓటరు నమోదు ఓట రు జాబితా తయారీతో పాటు చట్టసభలు, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది. ఎన్నికల్లో ఓటర్లు అందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అయితే దేశంలో చాలా మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవడం నిర్లక్ష్యం వహిస్తున్నారు.1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 45 శాతం ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించారు.
2024 నాటికి ఇది 66.10 శాతానికి చేరింది. అంటే 72 ఏళ్లలో కేవలం 22 శాతం ఓటింగ్ మాత్రమే పెరగడం గమనార్హం. అయితే మొత్తం ఓటర్లలో 90 శాతం ఓటింగ్ జరిగినప్పుడే దేశం అభివృధి పథంలో పురోగ మిస్తుందన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్యలు ఓటర్లకు కనువిప్పు కావాలి. ము ఖ్యంగా యువత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఓటు వేయడంపై ఆసక్తి చూప డం లేదు. సాధారణ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. పట్టణ ప్రాం తాల్లో చదువుకున్న వారు ఓటింగ్‌పై ఆసక్తి చూపడం లేదు. ఓటు వేయాలని ప్రోత్సహి స్తూ ప్రభుత్వాలు ఆరోజు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసినప్పటికీ ఓటర్లు మాత్రం విహార యాత్రలకు వెళ్తుండడం శోచనీయం.
అంగడి సరుకుగా..
ప్రజాస్వామ్యానికి ఓటు ఆయుధం, అటువంటిది ‘నోటుకు ఓటు’ ప్రజాస్వామ్యానికి చేటు అన్న మాదిరిగా ధనప్రయోగం వంటివి తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. మన రాజకీయ పార్టీలు ఎక్కువగా ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. అది నిజంగా దేశానికి ప్రయోజనం కలిగించిందా అనేది చర్చనీయాంశంగా మా రింది. దేశ రాజకీయాల్లో పోటీ పెరగడంతో పాటు, దేశంలో మధ్య తరగతి ప్రజానీకం సంఖ్యాబలం విస్తరించింది ఓటరు నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.
కానీ రాజకీయ పార్టీలు ఓటును అంగడి సరుకుగా మార్చేస్తున్నాయి. డబ్బు, మద్యం వివిధ ప్రలోభాలకు ఓటును అమ్ముకునే ‘నోటుకు ఓటు’ సంస్కృతి పెరిగి ప్రజాస్వామ్యానికి చేటుగా పరిణమించింది. రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బులు ఎరగా చూపి ఓటు వేయించుకుంటున్నారు. రాజకీయ పా ర్టీలు హామీల హోరులో హర్రసు పాట పా డుతూ ఓటర్లను హైరానాకు గురిచేస్తూ ఓ టు బ్యాంకుగా వాడుకొని ఎన్నికల్లో గెలిచి అధికార దాహంతో రాజకీయాలను వాణిజ్యపరం చేస్తున్నారు. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించింది. స్వయంప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు జేబు సంస్థగా మారిందనే ఆరోపణలు ఇటీవలే పెరిగిపోయాయి.
ఈ ఆరోపణలు రాజకీయ పార్టీల మీద ఈసీ నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. ఈ పరిస్థితులు ప్రజాస్వామ్య వ్యవస్థ స్ఫూర్తికి విఘాతంగా పరిణమించాయి. ఓటును అ మ్ముకోవడం ద్వారా ప్రజలు ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కును కోల్పోతారు. ప్రజా సంక్షేమం కుంటుపడుతుంది. దేశ భవిష్యత్తు నాయకుల చేతుల్లో వుంటుంది. ఆ నాయకుల తలరాత మార్చేదే ఓటు. ‘అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు.. ఏపాటి వాడో చూడు’ అని ప్రజాకవి కాళోజీ నారాయణరావు అన్నట్లుగా నేరచరిత్ర లేని నిజాయితీవంతులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకొని అవినీతిరహిత, నేరరహిత రాజకీయ వ్యవస్థకు ఓటర్లు ఉద్యమించాలి.
ఓటర్లలో చైతన్యం తేవాలి!
దేశ భవిష్యత్తు, అభివృద్ధి ప్రభుత్వాల మార్పుకు ఓటు వజ్రాయుధం లాంటిది. భారత ఎన్నికల సంఘం 1950, 1951 సంవత్సరాల్లో తెచ్చిన రెండు ప్రజా ప్రాతినిధ్య చట్టాల ప్రకారం నడుచుకుంటున్నా, 2025- ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ(సర్) చర్చనీయాంశమవు తోంది. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారంలో చూపిస్తున్న శ్రధ్ధ కంటే ఎక్కువగా ఓ టు హక్కు వినియోగం, ఈవీఎంల ఉపయోగంపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి. రా జకీయ పార్టీలు, యువత ఆధ్వర్యంలో ఓటు నమోదు, ఓటరు గుర్తింపు, ఆధార్ కార్డుతో ఓటరు కార్డు అనుసంధానం, దొంగ ఓటర్ల గుర్తింపు కార్యక్రమాలను సమర్థంగా చేపట్టాలి. ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చెయ్యాలి.
ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రద్దుతో పాటు శిక్షలు, జరిమానాలు విధించేలా నిర్బంధ ఓటు హక్కును ప్రవేశపెట్టాలి. ప్రపంచంలో ఆస్ట్రేలియా, బ్రెజిల్, అర్జెంటీనా, సింగపూర్, బెల్జియం దేశాల్లో నిర్బంధ ఓటుహక్కును అమలు చేస్తున్నా యి. విద్వేష పూరిత ప్రసంగాలు విరివిగా వ్యాపిస్తూ, మన ప్రజాస్వామ్యానికి సవాళ్లు విసురుతున్న క్రమంలో అభ్యర్థులుగా అనర్హత వేటు వేసే విధంగా ఎన్నికల కమిషన్ ఓటర్లను జాగృతం చేయాలి. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అవుతుంది. భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ చెప్పినట్లు భారతదేశం చారిత్రకంగా వెనుకబడిన వర్గాలు దళితులు, ఆదివాసీలు, పీడిత వర్గాలు రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ఓటు హక్కు ముఖ్యమైన మా ర్గం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడాన్ని ప్రజలు సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తామని ఓటర్లు ప్రతిజ్ఞ చేసినప్పుడే ప్రజాస్వామ్యం వర్దిల్లుతుంది.
వ్యాసకర్త సెల్: 9866255355
డాక్టర్ సంగని మల్లేశ్వర్