11-02-2025 12:00:00 AM
భద్రాచలం, ఫిబ్రవరి 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఐటీడీఏ పరిధిలోగల ఆశ్రమ పాఠశాలలో చదువు కునే విద్యార్థులకు చదువుతోపాటు కంప్యూ టర్ మేధాశక్తి వారిలో దాగి వున్న ప్రతిభను పెంపొందించుకోవడానికి ప్రాథమికస్థాయి నుండి కంప్యూటర్‌పై అవగాహన కల్పించ నున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహు ల్ తెలిపారు.
సోమవారం పీఎంఆర్సి భవ నంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠ శాలలకు సరఫరా చేయడానికి కొనుగోలు చేసిన కంప్యూటర్లను ఆయన పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఐదవ తరగతి నుండి తొమ్మిదవ తరగ తి చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యా ర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొం దించుకోవడానికి ప్రత్యేకంగా ఆన్లున్ తరగ తులు నిర్వహిస్తామన్నారు. డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఏసీఎంవో రమణయ్య, కంప్యూటర్ ఆపరేటర్లు రాజే ష్, శేఖర్, రామ్‌కుమార్ పాల్గొన్నారు.