11-09-2025 12:17:10 AM
విద్యార్థులకు మద్దతు పలికిన విద్యార్థి సంఘాల నేతలు..
ఆదిలాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాం తి): జిల్లాలోని వివిధ ఆశ్రమ పాఠశాలలతో పాటు పలు హాస్టల్లో ఉంటున్న పేద విద్యార్థు లు నాణ్యమైన భోజనం లభించక ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో కలుషితమైన ఆహారంతో ఫుడ్ పాయి జన్ అయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు ఆందోళన సైతం చేపట్టారు.
తాజాగా నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళన దిగారు. తమకు అందిస్తున్న కిచిడీతో పాటు మధ్యాహ్న భోజనం అన్నంలో సైతం పురుగులు వస్తున్నాయంటూ బుధవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ ప్లేట్లలో పురుగుల అన్నం చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పలు విద్యార్థి సంఘాలు విద్యార్థుల నిరసనకు మద్దతు పలికాయి.
నాణ్యమైన భోజనాన్ని అందించ డంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్.ఓ ను వెంటనే సస్పెండ్ చేయాలని యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆత్రం నగేష్, పి.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు జీవితాలతో ఆడుకోవద్దని అన్నారు. కేజీబీ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలి, మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు.