calender_icon.png 11 September, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖరా(కే)లో యూరియా కోసం వినూత్న నిరసన

11-09-2025 12:15:50 AM

ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేసిన అన్నదాతలు... 

ఇచ్చోడ, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి):  జిల్లాలో యూరియా లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు యూరియా కోసం రైతన్న లు బిక్షాటన చేయ్యాల్సిన దుస్థితి నెలకొంది. బుధవారం ఇచ్చోడ మండలం ముఖరా (కే) గ్రామంలో  రైతులు ఇంటిటి కి తిరిగి యూరియా ఉంటే ఇవ్వండి అంటూ యూరియా కోసం బిక్షాటన చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు చివరికి యూరియ కోసం బిక్షాటన చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అని, యూరియా దొరకక రైతుల బ్రతుకులు ఆగమయ్యాయి అని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  మార్పుమార్పు అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతులను మోసం చేసిందని, నాడు కేసీఆర్ పాలనలో ఆటో డ్రైవర్ కు డబ్బులు ఇస్తే చాలు ఇంటికి యూరియా బ్యాగులు  తీసుకోవచ్చే వారని పేర్కొన్నారు.

కానీ నేడు కాంగ్రెస్ పాలనలో యూరియా దొరకక  రైతులకు యూరియా కోసం బిక్షాటన చేసే పరిస్థితికి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభా ష్, పలువురు రైతులు పాల్గొన్నారు.