12-07-2025 08:45:17 PM
నెబుల్లా టవర్స్ బాధితుల ఆందోళన...
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): రెరా ప్లీజ్ హెల్ఫ్... మేము మోసపోయాం అంటూ బాచుపల్లి నెబుల్లా టవర్స్ బాధితులు శనివారం రోడ్డు ఎక్కారు. పసిఫికా కన్స్ట్రక్షన్ బాచుపల్లి సర్వే నంబర్స్ 213, 214, 218 సర్వే నంబర్స్ లలో తొమ్మిదిన్నర ఎకరాలలో అపార్ట్మెంట్స్ నిర్మాణాలు చేపట్టారు. అయితే పెసిఫికా కన్స్ట్రక్షన్ సంస్థ ఫ్రీ లాంచింగ్ పేరుతో 2016 సంవత్సరంలో సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్స్ ను 850 ఎస్ ఎఫ్ టీ చొప్పున ఇళ్లు నిర్మించేందుకు గాను ఎస్ ఎఫ్ టీకీ ధర 3500 రూ. చొప్పున అమ్మడం జరిగింది. అయితే ఫ్రీ లాంచింగ్ ఫ్లాట్స్ అమ్మిన సమయంలో 4 ఏళ్ల లోపు అంటే 2020 వరకూ అన్ని ఏమినిటీస్ తో ఇళ్లు పూర్తి చేసి అప్పగిస్తానని పసిఫికా బిల్డర్ అగ్రిమెంట్ ఇచ్చాడు.
కానీ నేటికీ ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం బిల్డర్ అపార్ట్మెంట్ ఇళ్ల పనులు పూర్తి చేయకపోగా ఎస్ ఎఫ్ టీ కీ మరో వెయ్యి రూపాయలు ధర చెల్లించాలని లబ్ధిదారులకు అల్టీమేటం ఇచ్చి ఇబ్బందులకు గురిచేయడంతో ఇళ్లు కొన్న బాధితులు శనివారం కన్స్ట్రక్షన్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. రెరా చట్టాలను ఉల్లంఘిస్తూ పసిఫీకా బిల్డర్ మాకు ఇళ్లను సకాలంలో అప్పజెప్పకపోవడంతో అదనపు డబ్బులు డిమాండ్ చేయడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్యలపై రెరా, ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.