calender_icon.png 14 July, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిష్ట కళాశాలలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం

12-07-2025 08:46:01 PM

చివ్వేంల,(విజయక్రాంతి): ఈరోజు సూర్యాపేట జిల్లా, చివ్వేంల మండలం, దూరజ్ పల్లి గ్రామంలో గల ప్రతిష్ట కళాశాలలో బీఫార్మసీ మూడవ సంవత్సరం విద్యార్థులు, బీఫార్మసీ నాలుగో సంవత్సరం విద్యార్థుల కొరకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ డాక్టర్ విజయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచిగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కిషోర్ మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో చదివి బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు.  అనంతరం విద్యార్థులు వివిధ రకాల డ్యాన్సులు సాంస్కృతిక  కార్యక్రమాలు నిర్వహించారు.