12-07-2025 08:42:28 PM
తుర్కయంజాల్: అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యత పాటించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 10, 11, 12, 20వ వార్డుల్లో రూ.8.46 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డితో కలిసి ఎమ్మెల్యే రంగారెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుర్కయంజాల్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. రాష్ట్రంలోనే నెంబర్ వన్ పురపాలికగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. తాను ఎమ్మెల్యే అయ్యాక మున్సిపాలిటీకి వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామన్నారు. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. నూతన కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.