calender_icon.png 18 December, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే సహించబోం

18-12-2025 12:36:11 AM

బొగ్గు బ్లాక్ వేలాలపై ఏఐటియుసి అధ్యక్ష, కార్యదర్శులు విలేకరుల సమావేశంలో వెల్లడి

కొత్తగూడెం, డిసెంబర్ 17 (విజయక్రాంతి): ప్రభుత్వం చేపడుతున్న బొగ్గు బ్లాక్ వేలంలో సింగరేణి బొగ్గు పరిశ్రమకు అన్యాయం చేయాలని చూస్తే సహించేదిలేదని, సింగరేణి బొగ్గు పరిశ్రమను పరిరక్షించు కుంటామని ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శి సింగరేణి గుర్తింపు సంఘం నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజకుమార్ తెలిపారు.

బుధవారం కొత్తగూడెం శేషగిరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మణుగూరు, పీకే ఓపెన్ కాస్ట్ డిప్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టుల  సంబంధించి సింగరేణి బొగ్గు పరిశ్రమకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల తవ్వకాల పొడిగింపుకు సంబంధించి సింగరేణి పరిశ్రమకు మాత్రమే అవకాశం ఇచ్చి తీరాలని, లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు.

సింగరేణి సంస్థ కాకుండా అదని మెగా కృష్ణారెడ్డి, ఏఏంఆర్ లాంటి ప్రైవేటు కంపెనీలకు బొగ్గు బ్లాక్లను ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల తవ్వకాల పొడిగింపులను అప్పగిస్తే  ఆ సంస్థలను అడుగుపెట్టనివ్వమని తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమ తరహాలు సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మణుగూరు పీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను సింగరేణికి అప్పగించకపోతే యావత్తు సింగరేణి పరిశ్రమకే నష్టం జరిగే పరిస్థితి తలెత్తుతుందన్నారు. కంపెనీ మనుగడే ప్రశ్నార్థకమే పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు.

గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. అలాగే డీఎంఎఫ్, సింగరేణి సిఎస్‌ఆర్ నిధులు స్థానిక ప్రాంతాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.

సింగరేణి బొగ్గు పరిశ్రమను పరిరక్షించుకోవడం కోసం, బొగ్గు బ్లాక్లను సాధించుకోవడం కోసం పరిరక్షణ సమితి పేరిట అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా, కార్మికసంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని స్పష్టం చేశారు. బొగ్గు పరిశ్రమను కాపాడుకునేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శిలు మల్లికార్జునరావు, రాంగోపాల్, రమణమూర్తి, ఎఐటియుసి నాయకులు వీరస్వామి,క్రిస్టోఫర్,ఎర్రగని కృష్ణయ్యా, సందబోయన శ్రీనివాస్, హుమాయూన్, రాములు, బండారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.