calender_icon.png 18 December, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్ర తిరగ రాసిన కాంగ్రెస్ పార్టీ

18-12-2025 12:37:40 AM

పినపాక, డిసెంబర్ 17, (విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, పినపాక నియోజకవర్గం, జానంపేట పంచాయతీలో చరిత్రను తిరగ రాసిన కాంగ్రెస్ పార్టీ. గడిచిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో  విజయకేతనం ఎగరవేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు జానంపేట ఓటర్ మహాసేయులు ఆకర్షితులై పంచాయతీ పరిధిలో గల సర్పంచ్, 12 మంది వార్డు సభ్యులను  అత్యధిక మెజార్టీతో గెలిపించారు.

పంచాయతీ పరిధిలో గల  ముఖ్య నాయకులు పేరం వెంకటేశ్వరరావు, సాగి సురేష్, పడాల రాము, బెడద నరేందర్, హమీద్, సుతారపు వీరన్న, కబ్బాక సతీష్, బందెల అనిల్, భానోత్ భాస్కర్, పోలిశెట్టి నరేందర్, దుగ్గిరాల లక్ష్మణ్, కిషోర్, కందుల సతీష్, పత్తి ఉమేష్, తోలెం రాము, దుర్గం కృష్ణ,  బద్దల వెంకటేశ్వరరావు, ఆవుల సునీల్, బిక్కం నరసింహారావు, దందర  నరేష్, అత్తి లక్ష్మీనారాయణ,  కృషితో పంచాయతీలో జానంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది.

ఈ సందర్భంగా ముఖ్య నాయకులు పేరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జానంపేట ప్రజలకు, సర్పంచ్, 12 మంది వార్డు సభ్యులను గెలిపించిన ప్రజలకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీలో  ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా  నా దృష్టికి తీసుకువస్తే  పరిష్కారానికి నా వంతు సహాయకరాలు అందిస్తానని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని అన్నారు.

1వ వార్డు మడికాంత, 2వ వార్డు వాసం కుమార్, 3వ వార్డు కామిశెట్టి హిమబిందు, 4వ వార్డు జర్పుల  శ్రీవిద్య, 5వ వార్డు పాడిబండ్ల సత్యనారాయణ, 6వ వార్డు పొనుగోటి చందర్ రావు, 7వ వార్డు జబ్బా శారద, 8వ వార్డు కబ్బాకు రమేష్, 9వ వార్డు పోలిశెట్టి హరీష్, 10వ వార్డు కందల పద్మ, 11వ వార్డు దాట్ల రాజేష్, 12వ వార్డు ఎనిక సుజాత విజయం సాధించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించినందుకు సర్పంచ్, వార్డు సభ్యులు పంచాయతీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.