calender_icon.png 2 July, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి

02-07-2025 12:04:53 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

    వనపర్తి టౌన్ జూలై 1: జిల్లాలో అకస్మాత్తుగా వరదలు వస్తే ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్ కాన్ఫ రెన్స్ హాల్లో విపత్తు నిర్వహణ పై లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలెక్టర్ ముందస్తు సన్నద్ధత పై సమావేశం నిర్వహించారు.

2009 సంవత్సరంలో వచ్చిన వరదలకు వనపర్తి జిల్లాలోని ఏఏ మండలాలలో ఏ ఏ గ్రామాలు వరదలకు గురయ్యాయో వాటికి సంబంధించిన వివరాలు నది పరివాహక ప్రాం తంలో తీసుకోవలసిన ముందస్తు చర్యలపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని అమర్చింత, ఆత్మకూర్, చిన్నంబావి,కొత్తకోట, పెబ్బేర్ తదితర ప్రాంతాల్లో అధిక వర్షా లు,లేదా కర్ణాటక, మహారాష్ట్ర లలో అధిక వర్షాల వల్ల కృష్ణా నది ఉదృతంగా ప్రవహించే ప్ర మాదం ఉంటుందని అందుకు అనుగుణంగా ఆయా మండలాల్లో లైన్ డిపార్ట్మెంట్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రజల, జంతువుల ప్రాణ నష్టం, జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మండల తహసిల్దార్లు పోలీస్ అధికారులు పంచాయతీ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవె న్యూ జి వెంకటేశ్వర్లు ఆర్డిఓ సుబ్రహ్మణ్యం ముఖ్య ప్రణాళిక అధికారి భూపాల్ రెడ్డి,మత్స్య శాఖ అధికారి లక్ష్మప్ప, విద్యుత్ శాఖ డి.ఈ శ్రీనివాస్, ఫైర్ శాఖ అధికారులు, కొత్తకోట సిఐ శివకుమార్,తహసిల్దార్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.